మలేరియా నిర్మూలనకు సహకరించాలి
● నేటి నుంచి దోమల నివారణ మందు పిచికారీ
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి, పాడేరు: జిల్లాలో మలేరియాతో పాటు కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి దోమల నివారణ మందు మొదటి విడత పిచికారీని ప్రారంభించాలని మలేరి యా, వైద్య ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 22 మండలాల్లోని 311 గ్రామ సచివాలయాల పరిధిలో 2,086 గ్రామాలను ఎంపికచేశామన్నారు.ఈ గ్రామా ల్లో 5.16లక్షల జనాభాకు దోమకాట్ల బెడద లేకుండా దోమల నివారణ మందును వారి నివాసాల్లో పిచికారీ చేస్తామని చెప్పారు. జిల్లా, మండల, పంచాయతీ స్థాయిల్లో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలు పిచికారీని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి బయట, లోపల, పరిసరాల్లో దోమల నివారణ మందును తప్పనిసరిగా పిచికారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.


