రంపచోడవరం వైటీసీలో కలెక్టర్ కార్యాలయం
●కొత్త జిల్లాలో పాలనకు ఏర్పాట్లు
రంపచోడవరంలో కలెక్టరేట్ ఏర్పాటుచేయనున్న యూత్ ట్రైనింగ్ సెంటర్
రంపచోడవరం: రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో పాలనకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో (వైటీసీ)లో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బుధవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ప్రారంభించనున్నారు. అలాగే పరిపాలనలో ముఖ్యమైన ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వంటి కీలకమైన పోస్టులను బుధవారం సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుంచి కొత్త జిల్లాలో పరిపాలన ప్రారంభం కానుంది.


