డుంబ్రిగుడ: గేట్– 2025లో ఆల్ ఇండియా 738 ర్యాంక్‌ను సాధించి డుంబ్రిగుడ యువకుడు శెట్టి అనిల్‌కుమార్ సత్తాచాటాడు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో సబ్ డివిజనల్ ఇంజినీరుగా చైన్నెలో ఐదు సంవత్సరాల పాటు పనిచేసి ప్రస్తుతం హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్ గతంలో గేట్‌లో ర్యాంక్ సాధించి, ఎం.టెక్ చేసిన తరువాత బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం పొందాడు. ఈఏడాది నిర్వహించిన గేట్‌లో మళ్లీ 738 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడంపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రి శెట్టి కృష్ణారావు వెలుగు ఏపీఎంగా అరకులోయలో విధులు నిర్వహిస్తున్నారు.


