వ్యసన రహిత సమాజానికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

వ్యసన రహిత సమాజానికి పాటుపడాలి

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

ఆదిలాబాద్‌: వ్యసన రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారీస్‌ సేవా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌–మిషన్‌ స్పందన్‌’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార రథాన్ని ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్‌ సంస్థ ప్రభుత్వ శాఖలతో కలిసి చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇందులో కౌన్సిలర్‌ జ్యోతి, బీకే రేవతి, పుష్ప, గీత, అర్చన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement