గుడిహత్నూర్: కొల్హారీ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. మండలంలోని కొల్హారీ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామైఖ్య సంఘ భవనాన్ని అదనపు కలెక్టర్ చిత్రుతో కలిసి శుక్రవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఐక్యతతో గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఇందులో ఎంపీడీవో ఇంతియాజ్, సర్పంచ్ శివాజీ, ఉప సర్పంచ్ కిరణ్, ఐకేపీ ఏపీఎం సుజాత, పీఆర్ ఏఈ దినేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.


