తెల్లబోతున్న రైతు! | - | Sakshi
Sakshi News home page

తెల్లబోతున్న రైతు!

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

ఈ ఏడాది వెంటాడిన ఎల్‌నినో వర్షాభావంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం ఎకరానికి మూడు క్వింటాళ్లలోపే.. సగం పెట్టుబడి కూడా రాని దుస్థితి అగమ్యగోచరంగా రైతుల పరిస్థితి

జిల్లాలో ఐదేకరాల్లోపు భూమి ఉన్న రైతులు : 70 వేలు (సుమారు)

ఇచ్చోడ: వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతును ఈ ఏడాది ఎల్‌నినో నిండా ముంచింది. జి ల్లాలో తొలకరి పలకరింపుతో పత్తి సాగుకు శ్రీకా రం చుట్టిన కర్షకుడి సంబురం కొద్ది రోజులు కూడా నిలవలేదు. వరణుడు కరుణిస్తాడని నెలల తరబడి నింగివైపు చూసిన వారి ఆశలు అడియాశలే అయ్యా యి. దున్నడం నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు, కూలీల ఖర్చు వెరసి పెట్టుబడి సైతం ఈ సారి పెరిగిపోయింది. ఎకరానికి రూ.30 వరకు వెచ్చించినట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట ఎదుగుదల లోపించింది. చెట్టుకు పది, 12 కాయలు మా త్రమే రావడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూ పింది. ఎకరానికి 8 క్వింటాళ్లు రావాల్సి ఉండగా మూడు క్వింటాళ్లలోపే వస్తుండడం గమనార్హం. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానం. సాగు వ్య యంతో పాటు వారికి కౌలు అదనపు భారంగా మా రింది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చేదెలా అనుకుంటూ మనస్తాపానికి గురవుతున్నారు. ఈ క్రమంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే తనువు చాలించి కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఒకటి మినహా అన్ని మండలాలను కరువుగా ప్రకటించిన ప్రభుత్వం అండగా ఉంటామని స్పష్టం చేసింది. సర్వే ఆధారంగా నివేదికలు సిద్ధం చేసి తదనుగుణంగా సాయం అందేలా చూస్తామని పేర్కొంటుంది. అయితే ఇది ఆలస్యమవుతుండడంతో రైతుల్లో ఆందోళన కొనసాగుతోంది.

పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి

జిల్లాలో ప్రధాన పంట పత్తి. అయితే తెల్లబంగారం సాగు పెట్టుబడి ఏటా పెరుగుతోంది. మరోవైపు ప్ర కృతి వైపరీత్యాల కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఎల్‌నినో నిండా ముంచింది. ఎకరానికి మూడు క్వింటాళ్లలోపే వస్తు న్న దిగుబడి చూసి రైతన్న బోరుమంటున్నాడు. రేటు కూడా గిట్టుబాటు కాకపోవడంతో ఎవుసం దండగే.. అంటూ మౌనంగా రోదిస్తున్నాడు. పెట్టుబడితో పాటు కష్టం కూడా కరువు కోరల్లో చిక్కుకుపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement