మరింత చేరువగా ‘ఆధార్‌’ | - | Sakshi
Sakshi News home page

మరింత చేరువగా ‘ఆధార్‌’

Nov 21 2026 12:14 AM | Updated on Nov 21 2026 12:14 AM

అందుబాటులోకి రీజియన్‌ అనుబంధ సేవా కేంద్రం

హైదరాబాద్‌కు వెళ్లకుండానే సమస్యల పరిష్కారం

ఉమ్మడి జిల్లావాసులకు ప్రయోజనం

కై లాస్‌నగర్‌: ఇలాంటి ఆధార్‌ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గతంలో హైదరాబాద్‌లో ని రీజియన్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఆర్థి కంగా వ్యయ, ప్రయాసలతో పాటు సకాలంలో టో కెన్‌ లభించక రోజుల తరబడి అక్కడే ఉండి అవస్థలు పడాల్సి వచ్చేది. అయితే ఈ సమస్యలను స్థాని కంగానే పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ కేంద్రంగా ఆధార్‌ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఇక్కడే ని త్యం 125నుంచి 200మందికి సేవలందిస్తున్నారు.

15 రకాల సేవలు

రీజినల్‌ కార్యాలయానికి అనుబంధంగా ఆదిలా బాద్‌ లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో ఎనిమిదో కేంద్రం కాగా ఉమ్మడి జిల్లాలో మొదటిది. పట్టణంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న ప్రారంభించారు. సెలువులనేవే లేకుండా వారం పాటు ఈ కేంద్రం సేవలందిస్తుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పనిచేసే ఈ కేంద్రంలో తొమ్మిది రకాల కేటగిరీల్లో దాదాపు 15 రకాల సేవలందిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారితో పాటు చిన్నారుల కొత్త ఆధార్‌ నమోదుకు అవకాశముంది. బయోమెట్రిక్‌ , పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌ వంటివి అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆధార్‌కు అనుసంధానం, ఈ ఆధార్‌ డాక్యుమెంటేషన్‌ వంటివి అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పేరు, ఇంటి పేరు, చిరునామా సైతం మార్చుకునే అవకాశముంది. అలాగే రద్దయిన వివాదాస్పదంగా ఉన్న కార్డుల సమస్యలు కూడా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది.

నాలుగు కౌంటర్లు

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈ కేంద్రంలో ఏడుగురు ఆపరేటర్లు పనిచేస్తుండగా నాలుగు కౌంటర్ల ద్వారా సేవలందిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్‌ కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

సద్వినియోగం చేసుకోండి

ఆధార్‌కార్డులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా సంప్రదించవచ్చు. రీజియన్‌ సెంటర్‌కు అనుబంధంగా పనిచేసే ఈ కేంద్రం ద్వారా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు రద్దయిన 125 ఆధార్‌ కార్డులను తిరిగి పునరుద్ధరించాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావాసులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

– రాంటెంకి కుందన్‌, కేంద్రం ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement