ఆర్టీసీ @ ఆధ్యాత్మికం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ @ ఆధ్యాత్మికం

Nov 16 2026 12:14 AM | Updated on Nov 16 2026 12:14 AM

● నిర్మల్‌ నుంచి నవంబర్‌ 20న బీదర్‌లోని ఝర నరసింహస్వామి, గాణగాపూర్‌ దత్తాత్రేయ, తుల్జాభవాని ఆలయాల సందర్శనకు రెండు రోజుల యాత్రను అందుబాటులోకి తెచ్చారు. టికెట్‌ ధర రూ.2,430. ● నవంబర్‌ 23న అరుణాచలం, కాణిపాకం, కంచీ పురం, శ్రీకాళహస్తి క్షేత్రాలకు ఐదు రోజుల యాత్రకు రూ.5,220 చార్జీ నిర్ణయించారు. నవంబర్‌ 30న సోమనాథ్‌, ద్వారకతో పాటు ఆరు జ్యోతిర్లింగాలు సహా 14 పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆరు రోజుల మహాయాత్రను రూ.8,640 తో ఏర్పాటు చేశారు. బుకింగ్‌ ప్రారంభమైంది.

పుణ్యక్షేత్రాల బాటలో ప్రత్యేక సర్వీసులు

అరుణాచలం, శబరిమలకు స్పెషల్‌ బస్సులు

కార్తిక మాసంలో భక్తులకు అందుబాటులో ప్రయాణ సౌకర్యం

ఆదిలాబాద్‌: తెలుగు పంచాంగంలో కార్తీక మాసానికి విశిష్టమైన స్థానం ఉంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కావడంతో భక్తులు పుణ్యక్షేత్రాల బాట పడుతుంటారు. ఈ మేరకు వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రీజియన్‌ పరిధిలోని ఆయా జిల్లా కేంద్రాల నుంచి వివిధ శైవక్షేత్రాలకు నడిపేలా స్పెషల్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

పుణ్యక్షేత్రాలు ఇవే..

ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆర్టీసీ డిపోల నుంచి అధి కారులు పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ, పండరీపురం, పంచారామాలు, బీదర్‌, తుల్జాపూర్‌, ద్వారక తదితర క్షేత్రాలకు స్పెషల్‌ బస్సులను నడపనున్నారు.

ఆదిలాబాద్‌ నుంచి..

అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌, జోగులాంబ ఆలయాల దర్శనానికి ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్‌ నుంచి సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరి, 21న రాత్రి 10 గంటలకు తిరిగి ఆదిలాబాద్‌ చేరుకుంటుంది. ఈ యాత్రకు పెద్దలకు ఒక్కొక్కరికి రూ.5,500, పిల్లలకు రూ.2,780 టికెట్‌ ధర నిర్ణయించారు.

శబరిమలైకి..

అయ్యప్ప స్వాములు, భక్తుల సౌకర్యార్థం ఆదిలా బాద్‌ నుంచి శబరిమలైకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. గ్రూపులుగా ప్రయాణించాలనుకునే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. గురుస్వామి, ఇద్దరు మణికంఠులు, ఇద్దరు వంట మనుషులు, ఒక లగేజీ అటెండెంట్‌కు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.

నిర్మల్‌ నుంచి..

ఆసిఫాబాద్‌ నుంచి..

ఆసిఫాబాద్‌ నుంచి నవంబర్‌ 23న అరుణాచలం, శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఆసిఫాబాద్‌ నుంచి శ్రీశైలానికి రూ.3వేలు చార్జీగా నిర్ణయించగా,అరుణాచలానికి టికెట్‌ ధర రూ.5,500.

భైంసా నుంచి..

భైంసా డిపో నుంచి నవంబర్‌ 16న వేములవాడకు, నవంబర్‌ 21న పండరీపురానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. వేములవాడకు రూ.600, పండరిపూర్‌కు రూ.2,450 టికెట్‌ ధర ఖరారు చేశారు.

మంచిర్యాల నుంచి..

మంచిర్యాల డిపో నుంచి నవంబర్‌ 22న పంచారా మాలకు, నవంబర్‌ 28న అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పంచారామ క్షేత్రాలకు రూ.3,300, అరుణాచల క్షేత్రానికి రూ.5,430, అరకుకు రూ.4,600 చార్జీలుగా నిర్ణయించారు.

సద్వినియోగం చేసుకోండి

కార్తిక మాసం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. ప్రముఖ శైవక్షేత్రాలైన అరుణాచలం, సోమనాథ్‌, శ్రీశైలం వంటి క్షేత్రాలకు రద్దీకి అనుగుణంగా సర్వీసులను సిద్ధం చేస్తున్నాం. 30 నుంచి 36 మంది ప్రయాణికులు కోరితే ఏ పుణ్యక్షేత్రానికై నా ప్రత్యేక సర్వీసును నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. రీజియన్‌ పరిధి లోని ఆయా డిపోల్లో సంప్రదించవచ్చు. అలాగే టీజీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సైతం బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.

– విజయభాను, ఆర్టీసీ ఆర్‌ఎం

సంప్రదించాల్సిన నంబర్లు..

డిపో పేరు సెల్‌ నంబర్‌

ఆదిలాబాద్‌ 99592 26002

భైంసా 99592 26003

నిర్మల్‌ 99592 26005

ఆసిఫాబాద్‌ 99592 26006

మంచిర్యాల 99592 26004

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement