బజార్హత్నూర్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎంపీ గొడం నగేశ్ అన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలో రూ.25 లక్షల నిధులతో గ్రంథాలయ నూ తన భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూ జ చేశారు. ఇందులో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాజు, పీఏసీఎస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ మాధవ్, నాయకులు పాల్గొన్నారు.
చెక్కు అందజేత
బోథ్: దండారీ సంబరాల్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న రూ.15వేల చెక్కును పార్డి కె గ్రామానికి చెందిన ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మెస్రం భూమన్నకు ఎంపీ నగేశ్ అందజేశారు.


