ఉట్నూర్‌రూరల్: గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ గిరిజన సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి పురస్కరించుకుని ఆదివారం ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్ హాల్‌లో కేంద్ర గిరిజన వ్యవహా రాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిరిజన గౌర వ దినోత్సవం’ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ నగేశ్, కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మకరందు జ్యోతి ప్రజ్వ లన చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని తెలి పారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన యువత ఆధునిక విజ్ఞానంతో పాటు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, విద్య, వైద్యం, సామాజిక చైతన్యం, అభివృద్ధి రంగాల్లో నిస్వార్థంగా సేవలందించిన పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా వేదికపై ఘనంగా సన్మానించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శణగా నిలి చాయి. కార్యక్రమంలో డీడీ అశోక్, ఈఈ తనాజీ, డీఈవో జి. చందన్, క్రీడల అధికారి పార్థసారథి, సందీప్, సిడం భీంరావు, దుర్గు పటేల్, ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.


