ఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచడంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్ర త్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికా రులను ఆదేశించారు. ఆదివారం క్యాంప్ కార్యాల యం నుంచి ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అ ధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు.పాఠశాలల వారీగా హాజరుశాతం, విద్యార్థు ల అభ్యసన సామర్థ్యాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే సమీక్షలో భాగంగా వెలువడిన నివేదిక ప్రకారం జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతం రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల హాజరుసగటు 89శాతం ఉండగా, జిల్లాలో కేవలం 74 శాతం మాత్రమే నమోదవుతోందని, ఉపాధ్యాయుల హాజరు రాష్ట్ర సగటు 90 శాతానికి పైగా ఉండగా, జిల్లాలో 80 శాతానికే పరిమితమైందని పే ర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రతిరోజూ విద్యార్థులతో సంబంధిత సబ్జెక్టుల్లో ప్రాక్టీస్ చేయించి సామర్థ్యాలను మెరుగుపర్చాలని పేర్కొన్నారు. ఇందులో డీఈవో మాధవి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


