ఆదిలాబాద్: కూచిపూడి మహా బృంద నృత్య ప్ర దర్శనలో తనదైన ప్రతిభతో మెరిసిన జిల్లా చిన్నా రి పడాల ధన్విక రెడ్డి రికార్డులు సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆదివారం భ్రమరి కూచిపూడి నృత్య నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓం శివోహం కార్తిక మాస నృత్య మహోత్సవం’లో 1,001 మంది నృత్యకారులు పాల్గొన్నారు. ఇందులో ధన్విక పాల్గొని ప్రతిభ కనబరిచింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. టీచర్స్ కాలనీకి చెందిన నాగసిరి వెంకటకృష్ణ రెడ్డి చిన్న కుమార్తె ధన్విక నాలుగేళ్లుగా బాలకేంద్రంలో మిట్టు రవి, దత్తు వద్ద కూచిపూడి, జానపద నృత్యాలతో పాటు కరాటేలో శిక్షణ పొందుతోంది.


