మహబూబ్‌నగర్ క్రీడలు/ఆసిఫాబాద్‌రూరల్:
మహబూబ్‌నగర్ హైస్కూల్ మైదానంలో ఎస్ జీఎఫ్ 70వ రాష్ట్రస్థాయి అండర్–17 హ్యాండ్‌బాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలుర విభాగంలో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు అద్భుతమైన ప్రతిభచాటి చాంపియన్‌గా నిలిచింది. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా బాలికలు అదరగొట్టారు. బాలుర ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు 14–12 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు 14–8 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలుపొందింది. బాలుర మూడోస్థానం కోసం జరిగిన మ్యా చ్‌లో రంగారెడ్డి జట్టు 13–7 గోల్స్ తేడాతో ఆదిలా బాద్‌పై, బాలికల మూడోస్థానం మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 4–3 గోల్స్ తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి. ఆయా విభాగాల్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ బాలికల జట్టులో కుమురంభీం జిల్లాలో గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన పదిమంది క్రీడాకారులు ఉన్నారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌రావు, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్ తెలిపారు.
నెట్‌బాల్ రన్నరప్‌గా ఆదిలాబాద్
ధన్వాడ: నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న 70వ ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ టోర్నీలో ఆదిలాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లా జట్లు పోటీపడగా ఇందులోనూ మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజయం సాధించగా.. రన్నరప్‌గా ఆది లాబాద్ జట్టు నిలిచింది. డీవైఎస్‌వో వెంకటేశ్‌శెట్టి విజేతలకు బహుమతులు అందజేశారు.


