బాసర: కుటుంబ సమస్యలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను నిర్మల్ జిల్లా బాసర పోలీసులు కాపాడి కుటుంబ సభ్యుల కు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. సికింద్రాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన షేన్ సవిత(30) కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహ త్య చేసుకోవాలని శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు బాసర గోదావరి నదిలో దూకింది. నీటిలో తు అక్కడ తక్కువ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గుర్తించి రక్షించారు. బాసర పోలీ సుస్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె సోదరుడు దాడెల్ల రాజేశ్‌కు అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో దీపక్ తెలిపారు.


