భవ్య క్షేత్రంగా బాసర | - | Sakshi
Sakshi News home page

భవ్య క్షేత్రంగా బాసర

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

● అభివృద్ధి పనులకు రూ.374 కోట్లు ● నిధులు కేటాయించిన ప్రభుత్వం ● భక్తులకు మెరుగుకానున్న వసతులు

భైంసా: గోదావరి తీరాన కొలువైన జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన బాసరను భవ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆలయానికి రూ. 354 కోట్లు, పుష్కరఘాట్లకు రూ.20 కోట్లు మొత్తం రూ.374 కోట్ల నిధులు కేటాయించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలికవసతుల కల్పన, సుందరీకరణ తదితర ప నులు చేపట్టనున్నారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, పు నరుద్ధరణతో పాటు పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్‌ తదితర వంటివి మెరుగుపర్చనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉద యం 10.50 గంటలకు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

భక్తులకు మరింత సేవలు

సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అక్షరాభ్యాసం కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాలతో క్షేత్రం నిత్యం సందడిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులతో భక్తులకు మెరుగైన వసతులు అందుబా టులోకి రానున్నాయి. ఆలయ అభివృద్ధితోపాటు సుందరీకరణ జరిగితే ఇక్కడ భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది.స్థానికంగా వాణిజ్యం, రవాణా రంగాలకు కూడా పర్యాటకానికి ఊతం లభించనుంది.

ఆలయ నమూనా చిత్రం

బాసర సరస్వతీ అమ్మవారు

మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆది వారం బాసర పర్యటన నేపథ్యంలో పకడ్బందీ గా ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం కలెక్టర్‌ పరిశీలించా రు. పార్కింగ్‌, భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భైంసా సబ్‌కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, అధికారులు, తహసీల్దార్లు, ఆలయ ఈవో అంజనాదేవి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement