విద్యాప్రమాణాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాప్రమాణాలు పెంచాలి

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

ఉట్నూర్‌రూరల్‌: ఉపాధ్యాయులు స్వీయప్రేరణతో విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌ పీఎంఆర్సీ భవనంలో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్‌ కలెక్టర్‌ ప్రణయ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 133 ఆశ్రమ పాఠశాలలు, 900 పైచిలుకు ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఈఎంఆర్‌ఎస్‌లో తొలిసారిగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సులభపద్ధతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. ఏపీవో భాస్కర్‌, డిప్యూటీ డీఈవో చందన్‌, గిరిజన క్రీడా అధికారి పార్థసారథి, డీటీడీవోలు, హెచ్‌ఎంలు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement