ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్‌లో చోరీకి పాల్పడిన రాజస్థాన్‌కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లా కై తారానికి చెందిన కుమావత్ గుందారం, కుమావత్ ఘన్‌శ్యామ్, కుమావత్ మాణిక్‌చంద్, కుమావత్ లక్ష్మణ్, హైదరాబాద్‌లోని పటాన్‌చెరు బండ్లగూడకు చెందిన తేజ్‌పాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆదిలాబాద్‌లోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించారు. ఇటీవల రాత్రి సమయంలో గడ్డపారతో షాప్ తాళాలు పగులగొట్టి లోపల వివిధ రకాల సిగరెట్ బాక్సులతోపాటు కౌంటర్‌లోని నగదు చోరీ చేశారు. హైదరాబాద్‌లోని పఠాన్‌చెరులో వారికి పరిచయమైన వ్యక్తికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీటి విలువ సుమారు రూ.5.35 లక్షలు ఉంటుంది. కొంత మొత్తానికి సిగరెట్ బాక్సులు విక్రయించి, వచ్చిన నగదును నలుగురు పంచుకున్నారు. మిగిలినవి విక్రయించేందుకు, ఆదిలాబాద్‌లో మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో తిరిగివచ్చారు. వాటిని విక్రయిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకుంటుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంబడించి అదుపులో తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 27 అమెరికన్ సిగరేట్ బాక్స్‌లు, 10 కింగ్ సైజ్, లైట్ 11, స్మాల్ గోల్డ్ 14, బ్రిస్టల్14, ఒకటి క్లాసిక్ రెడ్, ఓల్డ్ అడిషన్ 21, రెండు ఐస్ బస్ట్, కనెక్ట్ సిగరేట్ ఒక బాక్స్‌తో పాటు రూ.60వేల నగదు, చోరీకి వినియోగించిన మారుతీ కారుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.


