విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయిన 3 గంటల పాటు ఎండలో నిలబడి స్వయంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కుప్టి బస్టాప్ సమీపంలో భారీ వాహనాల రాకపోకల కోసం జేసీబీ సాయంతో తాత్కాలిక దారి మళ్లింపు పనులు దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హైవే అధికారులు సమస్యను పట్టించుకోక పోవడంతోనే నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు త్వరలోనే హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి హైవే అధికారులతో సమావేశమవుతానని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సాయంత్రం చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించారు.


