ఆదిలాబాద్‌టౌన్: మాదకద్రవ్యాలతో జీవితా లు నాశనం అవుతాయని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి హుస్సేన్ హుస్సేన్ అన్నారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలతో పాటు చట్టాలు, న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ, పాస్‌వర్డ్ తదితర వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూ చించారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం ద్వారా అందుతున్న న్యాయ సేవలు, ప్రజలకు లభించే ఉచిత న్యాయ సాయం తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


