కేసీఆర్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

Sep 6 2026 1:49 AM | Updated on Sep 6 2026 1:49 AM

● డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌ ● జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ

కై లాస్‌నగర్‌: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌జాదవ్‌ ఆరోపించారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగానూ విఫలమైన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాతీర్పును ఎదుర్కొవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేడ్కర్‌చౌక్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి , ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు మాని నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి వంటి అంశాలపై చర్చకు రావాలని సవాలు విసిరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడె గజేందర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్‌, సుజాత, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement