నిర్మల్‌టౌన్: చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాగులవాడకు చెందిన మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, నిర్మల్‌రూరల్ మండలం చిట్యాలకు చెందిన కల్గద్దవార్ శ్రీకాంత్, హైదరాబాద్‌లోని హల్దియాబాద్‌కు చెందిన సారా సాయికిరణ్ పరస్పరం పరిచయంతో ఒక్కటయ్యారు. స్నేహం కాస్తా చోరీలకు దారితీసింది. కలిసి ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలపై టైగర్స్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను గుర్తించింది. మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, కల్గద్దవార్ శ్రీకాంత్‌ను గతనెల 17న పట్టుకుంది. పరారీలో ఉన్న సాయికిరణ్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, గన్నవరం పోలీస్‌స్టేషన్‌న్‌పరిధిలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. జిల్లాలో నమోదైన 25 చోరీ కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. 12 కిలోల వెండి ఆభరణాలు, రూ.67 వేల నగదు, నిస్సాన్‌మాగ్నైట్ కారు, మెల్టింగ్ మెషిన్‌న్, గ్యాస్ పైప్ మెషిన్‌న్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, సమ్మయ్య, ఎస్సైలు లింబాద్రి, గణేశ్, శ్రీకాంత్, అశోక్, ఎస్.కె.గఫార్, హెడ్‌కానిస్టేబుల్ జగన్‌సింగ్, పీసీలు తిరుపతి, సతీశ్ తదితరులను ఎస్పీ అభినందించారు.
ఆలయాలే టార్గెట్..
పట్టణంలోని దివ్యనగర్, బంగల్‌పేట్, శాస్త్రినగర్, సారంగాపూర్ మండలం వంజర, ఆలూర్, నిర్మల్ రూరల్ మండలం కౌట్ల–కె, లోకేశ్వరం మండలం కిష్టాపూర్, మామడ మండలం, లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌లోని ఆలయాల్లో జరిగిన చోరీలో నిందితుల ప్రమేయం ఉంది. వీటితోపాటు ఇందిరానగర్, ప్రియదర్శినినగర్, శాస్త్రినగర్, ఏఎన్‌న్‌రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ కేసుల్లోనూ వీరి పాత్ర ఉన్నట్లు తేలింది.


