కై లాస్‌నగర్: ఈనెల 27న గ్రామ, వార్డుసభల్లో అర్హులైన ప్రతీ ఓటరును గుర్తించి, అందులో ఏ ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్‌ఏ–2లు, మండల, పట్టణ, వార్డు అధ్యక్షులపై ఉందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్క రూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


