సమరభేరికి సై | - | Sakshi
Sakshi News home page

సమరభేరికి సై

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

● నేడు కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల మహా ధర్నా ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ● 2వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలి. ● పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏ, డీఆర్‌లను విడుదల చేయాలి. ● సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలి. ● పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ● నూతన ఈహెచ్‌ఎస్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. ● ప్రతినెలా రూ.2వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన విధంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేసి చెల్లించాలి.

ఆదిలాబాద్‌టౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగా నేడు సమరభేరికి సిద్ధమయ్యారు. టీజీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం మహా ధర్నా చేపట్టనున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు విన్నవించినా సానుకూల స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైనట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్‌ ఉద్యోగుల వరకు సుమారు 7వేల మంది వరకు ఇందులో పాల్గొననున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం భాగస్వాములవుతున్నట్లు వెల్ల డించారు. మరోవైపు ఇప్పటికే కలెక్టర్‌ రాజర్షిషాను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశామని, ధర్నాకు అనుమతి కోసం ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను కూడా కలిసినట్లు వివరించారు.

డిమాండ్లు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement