ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఓనం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుపుకుంటారో అదే తరహాలో బెల్లూరి ఆలయం వద్ద భక్తులు భారీగా పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ప్రత్యేకమన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, గురుస్వాములు గొర్ల కృష్ణ, గణేశ్, సత్యం, లక్ష్మి, భక్తులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.


