ఆ భూములపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆ భూములపై ఫోకస్‌

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

ఈడీ జప్తు భూములపై అధికారుల దృష్టి

భోరజ్‌ మండలంలోని 98 మంది రైతులకు నోటీసులు

కలకలం రేపుతున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ భూముల వ్యవహారం

సాత్నాల: భోరజ్‌ మండలంలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్‌ కారిడార్‌ సంబంధించిన భూముల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇందుకోసం సేకరించనున్న భూముల్లో ఈడీ జప్తు చేసినవి ఉండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారంది. గతంలో నే తక్కువ ధరకు విక్రయించి, పట్టాలు మారిన భూ ములకు పరిహారం పొందనున్నట్లు గుర్తించిన అధి కార యంత్రాంగం వారికి నోటీసుల జారీకి శ్రీకారం చుట్టింది. మండలంలోని హత్తిఘాట్‌, గూడ, రాంపూర్‌, గిమ్మశివారులో ఉన్న 250 ఎకరాల జీఎస్‌ భూముల్లో క్రయవిక్రయాలు జరిగా యి. ఇందులో 98 మంది రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ఏం జరిగిందంటే..

గతంలో ఉన్న జీఎస్‌ భూములపై కొంతమంది వ్యక్తులు కన్ను వేసి భూముల విలువ పెరుగుతుందని గుర్తించారు. తమకు అనుకూలమైన వారికి, బినామీలపై పట్టాలు చేయించారు. కొన్ని పట్టా భూములు ఉండగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురికిపైగా చేతులు మారాయి. ఈ భూములపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరీశంకర్‌ రుణాలు తీసుకోగా, వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఈడీ జప్తు చేసింది. ఈ భూములకు సైతం భవిష్యత్తులో ధర పెరుగుతుందని గ్రహించిన కొంతమంది నాయకులు తమకు అనుకూలమైన వారిపై పట్టాలు చేయించారు. ఇలాంటివి వందలాది ఎకరాలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ భూముల పరిధిలోనే ఇండస్ట్రియల్‌ కారిడార్‌ రావడంతో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అసలు ఏం జరుగుతుందని అధికార, రాజకీయపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement