2024 జూన్ నుంచి 2026 జూలై వరకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలి. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లయింది. కమిటీ కాలయాపన చేస్తోంది. హెల్త్ స్కీమ్‌కు సంబంధించి మూడు నెలలుగా ఉద్యోగుల వేతనం నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చూడాలి. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం ప్రతినెలా రూ.2వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ అమలు చేయడం లేదు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
– శివకుమార్, టీజీవో జిల్లా అధ్యక్షుడు


