ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

ఆదిలాబాద్‌: మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను ము స్లింలు జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఖానాపూర్‌లోని జోహర మసీ దు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఇమామ్‌ మహ్మద్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఖద్రి ప్రవక్త జీవిత చరిత్ర, సేవలు, బోధనలను వివరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మహమ్మద్‌ ప్రవక్త జీవితం ఆదర్శప్రాయం

కైలాస్‌నగర్‌: మహమ్మద్‌ ప్రవక్త జీవితం యా వత్‌ మానవాళికి ఆదర్శప్రాయమని కలెక్టర్‌ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందేశంతో యువతలో మానవత్వం పెంపొందాలని ఆకాంక్షించారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త ప్రపంచా నికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం, శాంతి వంటి మహోన్నత సందేశాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు.

పండుగలు సోదరభావంతో

జరుపుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా ప్రజలు పండుగలను సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ బందోబస్తును పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అన్ని పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు శాఖ పటిష్ట భద్రత చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement