ఉపాధ్యాయ హక్కుల సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ హక్కుల సాధనకు కృషి

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

● ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్‌ అన్నారు. సంఘం 80 వసంతాల వేడుకను జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ఎస్టీయూ తల్లి వంటిదని, స్వాతంత్య్రానికి పూర్వమే సంఘం ఆవిర్భవించి ఎన్నో చారిత్రిక విజయాలతో మిగిలిన సంఘాలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదరి గజేందర్‌ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కులను పోరాడి సాధించడంలో సంఘం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement