రిమ్స్‌లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

Aug 27 2026 12:18 AM | Updated on Aug 27 2026 12:18 AM

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిమ్స్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్‌, సూపరింటెండెంట్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే రిమ్స్‌లో కొద్ది రోజులుగా జనరేటర్‌, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఎస్‌ఏడీపీ పనిచేయడం లేదని తెలిపా రు. వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. క్రిటికల్‌ కేర్‌లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పేర్కొన్నారు. రిమ్స్‌లో ఎనిమి ది లిఫ్ట్‌లు ఉండగా, రెండు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతావి కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 110 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎంబీబీఎస్‌ సీట్లకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమించాలన్నా రు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేనియేడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇందులో సంఘం నాయకులు కోట్నాక్‌ సక్కు, పెందూర్‌ గోవింద్‌, భీంరావు, రామారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement