ఆదిలాబాద్: హన్మకొండలో ఇటీవల నిర్వహించిన 12వ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–18 బాలికల విభాగంలో టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ ఇంద్రవెల్లి బాలికల కళాశాలకు చెందిన అజ్మీరా రమ్య రేస్‌వాక్‌లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. అదే కళాశాలకు చెందిన రాథోడ్ అంకిత అండర్–18 బాలికల హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం కై వసం చేసుకుంది. క్రీడాకారిణులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కార్యదర్శి రాజేశ్, కోచ్ వీజీఎస్ రాకేష్, పీడీ సౌమ్య ప్రత్యేకంగా అభినందించారు.


