కై లాస్‌నగర్: జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదో న్నతి లభించింది. అత్తఉల్లాఖాన్, బి.తులసీ రామ్, పి.ఆదిలక్ష్మి, ఎం.రాధ, కె.జయశ్రీ, ఎం. కోటేశ్వరరావు, ఎం.గోవింద్, డి.రమేశ్, జయకిష్టుకు పదోన్నతి కల్పిస్తూ బాసర జోన్ డీఐజీ ఆర్.భాస్కరన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వారికి పదోన్నతి చిహ్నమైన స్టార్‌లను శనివారం అలంకరించి అభినందించారు. మరింత ఉత్సాహంతో, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, పోలీ స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో సూచించారు. కేటుగాళ్లు అనేక పద్ధతుల్లో అమాయకులను మోసం చేస్తున్నారని తెలి పారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఖాకీ కిడ్స్ పేరిట సిబ్బంది గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీకే ఫైల్స్, తెలియని లింక్స్‌ను వాట్సప్‌లో, టెలిగ్రామ్‌లో వినియోగించడం ద్వారా మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి అకౌంట్లు ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలి పారు. ఈ వారం వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 38 ఫిర్యాదులు నమోదైనట్లు పేర్కొన్నారు. సైబర్‌నేరం జరిగిన వెంటనే 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.


