ఆదివాసీలు ఏళ్లుగా అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ అటవీ ఉత్పత్తులు, పోడు వ్యవసాయం చేసుకుంటూ పూరి గుడిసెల్లో నివాసముంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంతరంతో గూడు నిర్మాణానికి దూరమవుతున్న పరిస్థితి. ఇలాగైతే ఆదివాసీల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది.
– కుమ్ర రాజు, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సంక్షేమ ఫలాలు అందడం లేదు
ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏ ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా మారాయి. ఏటా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాలకులు హామీలు ఇస్తున్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఇప్పటికీ అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. తాగునీటికి తిప్పలు తప్పట్లేదు. విద్య, వైద్యం కూడా అంతంతే. చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందక రక్త హీనతతో బాధపడుతున్నారు. – మెస్రం శంకర్,
ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు
ఆదివాసీల అభ్యున్నతికి కృషి
ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా పీవీటీజీ తెగలకు చెందిన వారి అభ్యున్నతి, స్థితిగతులు, గూడెల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తుంది. ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా సమీక్షిస్తూ ఆదివాసీల సంక్షేమానికి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నాం.
– గోడం నగేశ్, ఎంపీ


