● ఆరేళ్ల నిరీక్షణకు తెర ● పింఛన్‌ దరఖాస్తుల స్వీకరణ షురూ ● సర్కారు ఆదేశాలతో అర్హుల్లో హర్షం | - | Sakshi
Sakshi News home page

● ఆరేళ్ల నిరీక్షణకు తెర ● పింఛన్‌ దరఖాస్తుల స్వీకరణ షురూ ● సర్కారు ఆదేశాలతో అర్హుల్లో హర్షం

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

● ఆరేళ్ల నిరీక్షణకు తెర ● పింఛన్‌ దరఖాస్తుల స్వీకరణ షురూ ● సర్కారు ఆదేశాలతో అర్హుల్లో హర్షం

కై లాస్‌నగర్‌: చేయూత పింఛన్ల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆగస్టు 15నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు జారీచేసింది. గతంలో ఆన్‌లైన్‌లో, ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకు న్న వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సెలవు రోజైనప్పటికీ శనివారం నుంచే స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవోకు, పట్టణ ప్రాంతాల్లోని వారు మున్సి పల్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా ప్రకటనలో సూచించారు.

అర్హులేవరంటే ...

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు , ఫైలేరియా, డయాలసిస్‌, సికిల్‌సెల్‌, హిమోఫిలియా వ్యాధిగ్రస్తులు చేయూత పింఛన్‌కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. వితంతు, ఒంటరి మహిళల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. చేనేత, గీత కార్మికులైతే 50 ఏళ్లు పూర్తికావా లి. సాగు భూమికి సంబంధించి మెట్ట 3.5 ఎకరాలు, మగాణి 7.5 ఎకరాలకు మించి ఉండరాదు. గ్రామీణ ప్రాంతాల్లోని వారి కుటుంబ వార్షికాదా యం రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారైతే రూ.2లక్షల లోపు ఉండాలి. ఇక ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు చేస్తున్న పిల్ల ల తల్లిదండ్రులు అనర్హులు. అలాగే అయిల్‌, రైస్‌ మిల్లులు, పెట్రోల్‌ బంక్‌లు, రిగ్‌ యజమానులు, ఇప్పటికే ప్రభుత్వ పింఛన్‌ లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ పొందేవారు కూడా అనర్హులే.

దరఖాస్తు విధానమిలా..

● దరఖాస్తు ఫారాలను మున్సిపల్‌, ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాల్లో ఉచితంగా అందజేస్తా రు. వాటిని పూర్తి చేసి వితంతువులైతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం జతచేయాలి.

● ఒంటరి మహిళలైతే విడాకులు తీసుకున్న, భర్త వదిలేసిన వారు 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. భర్త నుంచి వేరుగా ఉంటున్నట్లు తహసీ ల్దార్‌ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జతచేయాలి. అవివాహితులైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు పైబడిన వారు పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి ధ్రువీకరణ పత్రం జతచేయాలి.

● దివ్యాంగులకు వయస్సుతో సంబంధం లేదు. 40శాతం వైకల్యం కలిగి (వినికిడిలోపమైతే 51శాతం) ఉండాలి. సదరం, యూడీఐడీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. వీరంతా ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

● గ్రేడ్‌–1, 2 ఫైలేరియా బాధితులకు వయస్సుతో సంబంధం లేదు.వైద్యఆరోగ్యశాఖలో నమోదై, ధ్రు వీకరణ పత్రం కలిగి ఉండాలి. వీరు దరఖాస్తులను డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే అందజేయాలి.

● డయాలిసిస్‌, సికిల్‌సెల్‌, హిమోపిలియో వ్యాధిగ్రస్తులు ధ్రువీకరణ పత్రాలతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి తప్పనిసరి ..

అప్లికేషన్‌ ఫారంపై దరఖాస్తుదారుని ఫొటోను జతచేయాలి. ఆధార్‌కార్డు, వినియోగంలో ఉన్న బ్యాంకు పాస్‌బుక్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను తప్పసరిగా జతచేయాల్సి ఉంటుంది.

‘చేయూత’కు వేళాయె

మున్సిపల్‌ కార్యాలయంలో కౌంటర్లు

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఐదు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చైర్‌పర్సన్‌ అనూ ష పరిశీలించారు. ప్రతి పది వార్డులకు ఒకటి చొప్పున ఆన్‌లైన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ను వార్డు అధికారులు పరిశీలించి, అర్హత కలి గి న వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌వో కల్యాణ్‌, ఆర్‌ఐలు, బిల్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement