మద్యానికి దూరంగా.. అంతా ఒక్కటిగా | - | Sakshi
Sakshi News home page

మద్యానికి దూరంగా.. అంతా ఒక్కటిగా

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

ఆదిలాబాద్‌ (బేల): మద్యం మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు మండలంలోని చప్రాల గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. గ్రామంలో మద్యం విక్రయాలు, వి నియోగాన్ని నిషేధించాలని శనివారం ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్‌ మెస్రం దౌలత్‌, ఉప స ర్పంచ్‌ టాక్రే సాగర్‌ ఆధ్వర్యంలో గ్రామ సంక్షేమం, కుటుంబాల భవిష్యత్‌పై చర్చించారు. మద్యం వల్ల కుటుంబాల్లో కలిగే సమస్యలను అరికట్టి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు హేమంత్‌ పటేల్‌, గెడం సూర్యభాన్‌, మెస్రం శ్రీకాంత్‌, దోటే ఆకాష్‌, శాలిక్‌ నాకతే, మహిళలు లక్ష్మి అనకే, పంచపూల, మెస్రం యశోద, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement