ఖిలావరంగల్: రైలులో ప్రయాణికురాలి నుంచి బంగారు పుస్తెల తాడు చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ నరేష్‌కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం వరంగల్ ఎల్గూరు రంగంపేట రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని అంబేడ్కర్‌కాలనీకి చెందిన దుర్గం రాజు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికురాలి వద్ద రూ.6 లక్ష ల విలువైన 44 గ్రాముల బంగారు గొలుసు లభ్యమైంది. నిందితుడు దుర్గం రాజును రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ప్రభాకర్‌రెడ్డి, హెడ్ కానిస్టే
బుల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


