ఖానాపూర్: మండలంలోని కొమ్ముతండా, రంగంపేట తండా, సత్తన్‌పల్లి, గోసంపల్లి, ఏర్వచింతల్, బీర్నంది, కోలంగుడ, పాత ఎల్లాపూర్ గ్రామాల్లో శనివారం ఎకై ్సజ్, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఆదిలాబాద్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దాడుల్లో 6 కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రంగస్వామి తెలిపారు. 13 లీటర్ల గుడుంబా స్వాధీ నం చేసుకుని వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దా డుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, ఎస్సైలు వసంతరావు, సింధు పాల్గొన్నారు.


