బాసర: విద్యాపాలన, నైతిక నాయకత్వం, పరిశోధన రంగాలు మరిన్ని ఉన్నత శిఖరా లను అధిరోహించేలా రూపొందించిన హ్యాండ్‌బుక్ ఫర్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ వాల్యూమ్–1 పుస్తకాని శనివారం బాసర ఆర్జీయూకేటీలో ఆవిష్కరించారు. వైస్‌చాన్స్‌లర్ ఏ.గోవర్ధన్ రచించిన ఈ గ్రంథాన్ని ఆయనతో పాటు ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అసోసియేట్ డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌ఓడీలు), అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు కడెం నీటి విడుదల
జన్నారం: ఈ నెల 8న ‘ఆయకట్టు ఎదురు చూస్తోంది’ శీర్షి కన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు. ఈ నెల 9 ఆదివారం నుండి కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయనున్నట్లు తెలి పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పేండ్‌పెల్లిలో చోరీ
భైంసారూరల్: మండలంలోని పేండ్‌పెల్లిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు బెల్ట్‌షాప్‌లో దూరి రూ.20 వేల విలువైన మద్యం, పుల్లొల్ల మౌలాజీ ఇంట్లో 1.5 తులాల బంగారం, రూ.60 వేల నగదు ఎత్తుకువెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఒక్కరోజే మూడు చోట్ల చోరీ జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.


