దండేపల్లి: ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా దండేపల్లి మండలం లింగాపూర్ జీపీ పరిధిలోని బిల్కగూడెం మాత్రం అభివృద్ధికి దూరంగానే ఉంది. గూడెంలో సుమారు 17 కుటుంబాలు, 80కి పైగా జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు లేవు. గ్రామంలోని గిరిజనులకు వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునే స్థోమత లేకపోవడంతో ఓ గుత్తేదారును ఆశ్రయించగా అసంపూర్తిగా నిర్మించి వదిలేశాడు. ఆర్థిక స్థోమత లేని వారు అలాగే వదిలేయగా, కొందరు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని అందులో నివాసం ఉంటున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు మచ్చుకై నా లేవు. గూడెంలో చాలా కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవు. గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.
గుడిసెలో ఉంటున్నాం
మాకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇత్తం అంటున్నా రు. కానీ ఇప్పటికై తే ఇయ్యలేదు. గుడిసెలో ఉంటున్నాం. చిన్న పిల్లగాండ్లు ఉ న్నరు. చాలా ఇబ్బంది అయితంది. మొదటి విడతలో ఇత్తమన్నరు, రెండో దాంట్లో ఇత్తమన్నరు. ఇ ప్పటికీ ఇల్లు ఇయ్యలేదు. – ముడితె రజిత, బిల్కగూడెం


