ఆదిలాబాద్‌టౌన్: దేశ వ్యాప్తంగా ఎరువుల పంపిణీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను గురువారం నుంచి అమలులోకి తీసుకొస్తోంది. ఇకనుంచి ఈ యాప్ ద్వారానే రైతులకు అన్ని ఎరువులు పంపిణీ చేయనున్నారు. ముందుగా యాప్‌లో బు క్ చేసుకొని డీలర్ వద్ద నుంచి పొందాల్సి ఉంటుంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేయగా, అందులో ఆదిలాబాద్ ఉంది. గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూరి యా కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించిన విష యం తెలిసిందే. ఇక ఆ యాప్ సేవలు ముగియనున్నాయి. రైతులంతా ఎఫ్‌ఎఫ్‌ఎస్‌లోనే బుకింగ్ చేసుకొని ఎరువులు పొందాల్సి ఉంటుంది. అయితే కొంత మంది కొత్త విధానంపై గుబులు చెందుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మీసేవ కేంద్రాలు, సీఎస్‌సీ సెంటర్లలో బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
పారదర్శకత లక్ష్యంగా..
ఎరువుల పంపిణీలో మరింత పారదర్శకత కో సం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఎరువులు సబ్సిడీపై సరఫరా చేస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో ఉన్న యూరియా బుకింగ్ యాప్ ద్వా రా యూరియా మాత్రమే సరఫరా అయ్యేది. ప్ర స్తుతం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌తో యూరియా, డీఏపీ, పాస్పరస్, కాంప్లెక్స్ ఎరువులు తదితరవి డిజిటల్ విధానం ద్వారానే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే రైతులకు సకాలంలో అందుబాటులో ఉండేలా, ఎరువుల కోసం బారులుతీరడం, అనవసరంగా కొంత మంది పరిమితికి మించి నిల్వలు ఉంచడంతో గతేడాది రైతులు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. రైతు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే యాప్ ద్వారా సరఫరా అవుతాయి. అదనంగా పంపిణీ చేసే విషయమై ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాతే అందిస్తారు. బ్లాక్ మార్కెట్, ఎరువుల దుర్వినియోగం, అక్రమ నిల్వలు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడానికి వీలు లేకుండా పోతుంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో రైతు వివరాలు, సాగు విస్తీర్ణం, ఆధార్ నంబర్, రైతు ఐడీ నమోదు చేయాలి. ఎరువుల బుకింగ్ కోసం సంబంధిత డీలర్‌ను ముందుగా ఎంచుకోవాలి. ఏ రకమైన ఎరువులు ఎంత కావాలో న మోదు చేయాలి. అయితే బుకింగ్ చేసుకున్న రెండు రోజుల తర్వాత ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుకింగ్ చేసుకున్న తర్వాత అవస రం లేదనుకుంటే రద్దు చేసుకునే వెసులుబాటు క ల్పించారు. రైతు డీలర్‌వద్దకు వెళ్లిన తర్వాత క్యూ ఆర్ కోడ్ చూపించాలి. స్కాన్ చేసిన తర్వాత బుకింగ్ వివరాలు కనిపిస్తాయి. విక్రయం తర్వాత సమాచారం ఎఫ్‌ఎఫ్‌ఎస్ సర్వర్‌లో నమోదవుతాయి.
ఈ యాప్ ద్వారా రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎరువుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలను సంప్రదించాలని పేర్కొంటున్నారు. అయితే చాలా మంది రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. మీసేవ, సీఎస్‌సీ సెంటర్ల వద్ద వెళ్లి బుకింగ్ కోసం బారులు తీరాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు మేలు..


