సైబర్‌ నేరాలపై అప్రమత్తతే రక్షణ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తతే రక్షణ

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: సైబర్‌ నేరాలపై అప్రమత్తతే రక్షణ అని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సైబ ర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్ష కా తిరంగా–సైబర్‌ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఎస్పీ మా ట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కా ర్యాలయాలు,బ్యాంకులు, వ్యాపార సంస్థలు, మ హిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా స్టాక్‌ ట్రేడింగ్‌, పెట్టుబడులు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, డిజిటల్‌ అరెస్ట్‌, ఫేక్‌ లింకులు, నకిలీ యాప్‌లు, ప్రముఖుల పేర్లతో వచ్చే పెట్టుబడి ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘ఆగు.. ఆలోచించు.. ని జం నిర్ధారించు.. సైబర్‌ భద్రత పెంచు’ అనే సందేశాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై సురేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అన్నారు. రిమ్స్‌ ఆడిటోరియంలో ‘సైబర్‌ జాగృతి దివస్‌’ సందర్భంగా నిర్వహించిన అ వగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. రోజు రోజుకు నూతన పద్దతుల్లో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. జాబ్‌ఫ్రాడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌, లోన్‌ఫ్రాడ్‌, డిజిటల్‌ అరెస్ట్‌, ఏపీకే ఫైళ్లు, తెలి యని లింక్‌లు, ఆఫర్ల పేరుతో వచ్చే వాటిపట్ల ప్రజ లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదురైనా షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం రిమ్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో డీఎస్పీ ఎల్‌. జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్‌కుమార్‌, కె.నాగరాజు, బిడి.ప్రేమ్‌కుమార్‌, నైలు,ఎస్సైలు దేవేందర్‌, ప్రణయ్‌కుమార్‌, లెక్చరర్లు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement