వారి సేవలకు మంగళం పలికిన ప్రభుత్వం
విధుల నుంచి తొలగిస్తూ జీవో
జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు
త్వరలో శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు
జిల్లాలో నిలిచిన భూరిజిస్ట్రేషన్లు
కై లాస్‌నగర్: భూభారతి పోర్టల్‌లో పనిచేస్తున్న ఆపరేటర్ల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఈమేరకు సంబంధిత సిబ్బందిని ఎంపిక చేసిన యంత్రాంగం కలెక్టర్‌కు నివేదిక పంపించారు. కలెక్టర్ ఆమోదం అనంతరం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళనకు గురైన ఆపరేటర్లు ఇటీవల కలెక్టర్‌ను కలిసి తమను కొనసాగించేలా చూడాలని వేడుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు రాజధాని బాటపట్టారు. మూడు రోజులుగా విధులకు దూరం కావడంతో జిల్లాలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
తొమ్మిదేళ్లుగా విధుల నిర్వహణ
జిల్లాలో 19 గ్రామీణ మండలాలు ఉండగా 21మంది ఆపరేటర్లు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నా రు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు తొమ్మిదేళ్లుగా వి ధులు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున 19మంది పనిచేస్తుండగా కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు విధులు నిర్వహించారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.17,500 చొ ప్పు న వేతనం చెల్లిస్తోంది. అయితే ఇటీవల గ్రూప్ –3 లో ఎంపికై న వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో చాలామంది ఉన్నత విద్యావంతులు ఉండటంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం సైతం కలిగి ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో భూభారతి ఆపరేటర్లు అందిస్తున్న సేవలను ఇక నుంచి వీరికే అప్పగించాలని నిర్ణయించింది. ఈమేరకు ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో మూడు రోజు లుగా ఆపరేటర్లు విధులకు రావడం లేదు. ఫలితంగా తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ల ప్ర క్రియ నిలిచిపోయింది. ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లోని మీసేవ అపరేటర్లను తొలగించిన ప్రభుత్వం వారి బాధ్యతలను సైతం జూనియర్ అసిస్టెంట్లకే అప్పగించింది.
ఆందోళనలో ఆపరేటర్లు ..
ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆపరేటర్లు ఆందోళన కు గురవుతున్నారు. తొమ్మిదేళ్లుగా విధులు నిర్వహించిన తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమను య థావిధిగా కొనసాగించేలా చూడాలని వేడుకున్నా రు. అయితే ప్రభుత్వం వారిని తొలగిస్తూ జీవో జారీ చేయడంతో అధికారులు సైతం ఏమి చేయలని పరిస్థితి. దీంతో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ పెద్దలను కలువాలని నిర్ణయించిన ఆపరేటర్లు హైదరా బాద్ తరలివెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూమంత్రి పొంగులేటిని కలిసి తమను కొనసాగించేలా చూడాలని వేడుకోనున్నట్లుగా నిర్ణయించారు.


