కై లాస్‌నగర్: ఎయిర్‌పోర్టు నిర్మాణ భూసేకరణలో భాగంగా కేవలం రోడ్డు మాత్రమే కాకుండా గ్రామాన్ని పూర్తిగా తీసుకోవాలని అనుకుంట గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చారు. ప్రధాన ద్వారం ఎదు ట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లా కేంద్రానికి రావాలంటే రెండు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉందని, రోడ్డు మార్చడం ద్వారా 17 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ రోడ్డును తీసుకోవాలనుకుంటే గ్రామాన్ని కూడా తీసుకోవాలని, అలాగే భూ సేకరణలో ఎకరానికి కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యను విన్నవించారు.


