మంచిర్యాలక్రైం: గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల పరిధిలో ఇదివరకు పట్టుబడిన రూ.17లక్షల 9వేల విలువైన గంజాయిని కోర్టు అనుమతితో బుధవారం ధ్వంసం చేశారు. సీపీ మాట్లాడుతూ రెండు జిల్లాల పరిధిలో నమోదైన పాత 81 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 40కిలోల 173 గ్రాముల గంజాయితో పాటు 26 గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు. న్యా యాధికారుల సమక్షంలో ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల కోసం నమునాలు సేకరించి ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దపెల్లి డీసీపీ రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, నాగేంద్రగౌడ్, సీసీఆర్‌బీ సీఐ అనిల్, ఎస్సై వినిత తదితరులు పాల్గొన్నారు.


