బాసర లాడ్జీల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బాసర లాడ్జీల్లో తనిఖీలు

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

బాసర: ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌ ఆధ్వర్యంలో బుధవారం బాసరలోని ప్రైవేట్‌ లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీల్లోని గదుల రిజిస్టర్లు, అతిథుల వివరాలు, నిర్వహణ విధానాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. గదులు కేటాయించే ముందు ప్రతీ అతిథి ఆధార్‌ కార్డు, ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించి, దాని జిరాక్స్‌ ప్రతిని తీసుకోవాలని లాడ్జి నిర్వాహకులకు ఏఎస్పీ సూచించారు. అతిథుల పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు బస చేసిన వారి వివరాలు, ఆధార్‌ జిరాక్స్‌ ప్రతులను ప్రతిరోజూ సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలని ఆదేశించారు. గుర్తు తెలియని వ్యక్తులకు, అనుమానాస్పద వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వొద్దని హెచ్చరించారు. లాడ్జీల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముధోల్‌ సీఐ రవీందర్‌ నాయక్‌, బాసర సీఐ దీపక్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement