కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కారు దగ్ధం

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

లక్ష్మణచాంద: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కారు దగ్ధమైన సంఘటన మండలంలోని వడ్యాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వడ్యాల్‌ మా జీ సర్పంచ్‌ అట్ల లలిత భర్త అట్ల రాంరెడ్డి మంగళవారం తన ఇంటి ముందు కారును నిలిపి ఉంచారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పు పెట్టడంతో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు చూసి వెంటనే ఇంటి వారిని అప్రమత్తం చేశారు. వారు వచ్చి బోరు మోటర్‌ ఆన్‌ చేసి మంటలను ఆర్పి వేశారు. బుధవారం రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement