దేశ సేవే యువత లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

దేశ సేవే యువత లక్ష్యం కావాలి

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

భైంసా: దేశాభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని, ప్రతీ యువకుడు దేశ సేవనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్‌ శివశంకర్‌ పిలుపుని చ్చారు. బుధవారం పట్టణంలోని శ్రీవివేకా నంద ఆవాసంలో సేవా భారతి, శ్రీరామకృష్ణ సేవా సమితి, ఆవాసం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సై ఉద్యోగాల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. శివశంకర్‌ మాట్లాడుతూ సమాజ సేవతో పాటు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించే లక్ష్యంతో సే వా భారతి రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో సేవా భారతి, శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు, శ్రీవివేకానంద ఆవాసం నిర్వాహకులు, శిక్షకులు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కోల్‌వాషరీని సందర్శించిన అధికారుల బృందం

రామకృష్ణాపూర్‌: మందమర్రి ఏరియా పరిధి రామకృష్ణాపూర్‌ కోల్‌వాషరీని బుధవారం కార్పొరేట్‌ స్థాయి బొగ్గు ధ్రువీకరణ కమిటీ ప్రతినిధులు సందర్శించారు. వాషరీలోని స్లర్రీ, రిజెక్ట్స్‌ స్టాక్‌ కోల్‌ నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా ధ్రువీకరించారు. అనంతరం బొగ్గు నిల్వలు, నాణ్యత ప్రమాణాలు, నిర్వహణ తీరుపై అధికారుల బృందం సమీక్ష నిర్వహించింది. కార్యక్రమంలో జీఎం సీపీ అండ్‌పీ మనోహర్‌, జీఎం క్వాలిటీ రవికుమార్‌, జీఎం సర్వే రాఘవేంద్రరావు, జీఎం ఎఫ్‌అండ్‌ఏ చక్రవర్తి, జీఎం క్వాలిటీ బెల్లంపల్లి రీజియన్‌ వీరభద్రరావు, మందమర్రి జీఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement