గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

ఖానాపూర్‌: గుడుంబా నిర్మూలనలో భాగంగా ఎకై ్సజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఖానాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డీటీఎఫ్‌, నిర్మల్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సిబ్బంది, ఖానాపూర్‌ అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఈ దాడులు చేపట్టారు. సింగాపూర్‌ తండా, రాజూరా తండా, రాజూరా, ఇక్బాల్‌పూర్‌ గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో 6 కేసులు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 25 లీటర్ల ఐడీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, సుమారు 3వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అలాగే అటవీశాఖ అధికారుల సహకారంతో ఇక్బాల్‌పూర్‌ శివారు అటవీ ప్రాంతంలో మరో 2వేల లీటర్ల బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, నల్లబెల్లం అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి హెచ్చరించారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ గంగారెడ్డి, ఎస్సై అభిషేక్‌, ఎస్సై సింధు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నరేందర్‌తో పాటు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement