ఇంద్రవెల్లి: పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా స్థానిక పోలీసు స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులు గ్రామాల్లో నిరంతరం సందర్శిస్తూ వీపీవో విధానం కచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం సిబ్బందికి కేటాయించిన కిట్ సామగ్రిని పరిశీలించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


