పాఠశాలలకు మూలస్తంభాలు పీఈటీలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలకు మూలస్తంభాలు పీఈటీలు

Aug 5 2026 1:47 AM | Updated on Aug 5 2026 1:47 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు

ఉట్నూర్‌రూరల్‌: పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సర్వాంగీణ వికాసంలోను వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు) మూలస్తంభాల వంటి వారని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మంగళవారం ఉట్నూర్‌ కేజీబీవీ కాంప్లెక్స్‌ పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో జరుగుతున్న ఆశ్రమ పాఠశాలల పీఈటీల శిక్షణా తరగతులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఏ ఉపాధ్యాయుడు గుర్తులేకపోయినా వ్యాయామ ఉపాధ్యాయుడు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాడన్నారు. ప్రతీ విద్యార్థి ‘ఫిట్‌’గా ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిదేనన్నారు. క్రీడా మైదానాల కొరతను సాకుగా చూపకుండా, అందుబాటులో ఉన్న చిన్న మైదానం, వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, బూక్యా రమేశ్‌, ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.ఉత్తం, రిసోర్స్‌ పర్సన్లు వి.భూమన్న, ఎల్‌.ఎన్‌.శాసీ్త్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement