జన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌పల్లి ఇన్‌చార్జి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఎఫ్‌డీపీటీని ఇక్కడి నుంచి పంపించేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందన్నారు. రేంజ్ అధికారిపై చర్యలకు ఉన్నతాధికారులు స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ కమి టీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందునాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రియాజొద్దీన్, శంకరయ్య, సోహేల్, అజ్మత్ పాల్గొన్నారు.


